|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 04:00 PM
హీరోయిన్ సమంత రూతు ప్రభు… సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించిన సామ్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ సిరీస్ ద్వారా అటు నార్త్ అడియన్స్ కు దగ్గరయ్యింది.కొన్నాళ్లుగా లకు దూరంగా ఉంటున్న సామ్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే శుభం తో నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. అలాగే అటు సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆరోగ్యం, ఫిట్నెస్ విషయాలు పంచుకుంటుంది. తాజాగా ట్వీక్ ఇండియాతో ముచ్చటించిన సామ్.. తన వ్యక్తిగత అలవాట్ల గురించి పంచుకుంది. జర్నలింగ్, ధ్యానం, వెయిట్ లిఫ్టింగ్, వ్యాయమాలు తన దినచర్యలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో చెప్పుకొచ్చింది.ముందుగా సామ్ తన స్కిన్ కేర్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. కెరీర్ మొదట్లో చర్మాన్ని కాపాడుకునేందుకు ఎన్నో పద్దతులను పాటించానని.. కానీ కొన్ని చర్మ ఉత్పత్తులకు మాత్రమే కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ప్రతి సంవత్సరం స్కిన్ కేర్ విషయంలో ట్రెండ్ మారుతుందని.. ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కొన్ని ఉత్పత్తులు మాత్రమే చివరి వరకు ఉంటాయని అన్నారు.ఇక పెరుగుతున్న వయసు కారణంగా ఎప్పుడూ తన దినచర్యలో కొత్త కొత్త ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం సామ్ వయసు 38 సంవత్సరాలు. చర్మ సంరక్షణ కొరకు రెటినోల్ సన్ స్క్రీన్, సీరం ఉపయోగిస్తానని తెలిపింది. అలాగే ఫిట్నెస్ విషయానికి వస్తే.. హార్డ్ కోర్ వెయిట్, పవర్ లిఫ్టింగ్, యోగా, వెయిట్ లిఫ్టింగ్ రోజూ కఠినమైన వర్కవుట్స్ చేయడమే తన ఫిట్నెస్ సీక్రెట్ అంటూ అసలు విషయాన్ని రివీల్ చేసింది సామ్.
Latest News