|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 04:38 PM
స్టార్ హీరోస్ హ్రితిక్ రోషన్ మరియు ఎన్‌టిఆర్ నటించిన 'వార్ 2' ఆగష్టు 14, 2025న భారీగా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా గరిష్ట సంఖ్యలో స్క్రీన్‌లపై ఈ గూడచారి యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రదర్శించాలని వైఆర్‌ఎఫ్ యోచిస్తోంది. కియారా అద్వానీ ఒక పోలీసుగా హృతిక్ రోషన్ కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో బాబీ డియోల్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా బుక్ మై షో పోర్టల్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రం YRF స్పైవర్స్‌లో భాగం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంగీతాన్ని ప్రీతమ్ అందిస్తున్నారు.
Latest News