|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 03:28 PM
సినీ కార్మికుల వేతనాలపై పెంపుపై గత కొద్ది రోజులుగా సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేతనాల పెంపు, ఇతర సమస్యలపై చర్చించేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు రావాలని కోరింది. సమావేశానికి ఎంతమంది వస్తారో తెలియజేయాలని లేఖలో పేర్కొంది. నూతన వేతనాల, పని పరిస్థితులపై చర్చించనుంది.
Latest News