|
|
by Suryaa Desk | Thu, Aug 07, 2025, 02:32 PM
రామ్ దేశిన దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు నాగ శౌర్య ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ కి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ కి భారీ స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ప్రోమోని నా మావ పిల్లనిత్త అన్నాడే అనే టైటిల్ తో విడుదల చేసారు. అంతేకాకుండ ఫుల్ సాంగ్ ని ఆగష్టు 8న ఉదయం 11:07 గంటలకి విడుదల చేననున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో విధి మహిళా ప్రధాన పాత్రలో నటించింది. సముద్రకని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి మరియు శ్రీదేవి విజయ్‌కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు మరియు హారిస్ జయరాజ్ సంగీత స్వరకర్తగా ఉన్నారు. రామాంజనేయులు కళా దర్శకత్వం వహిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిలింస్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News