|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 03:44 PM
భారతదేశపు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన ZEE5, ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'J.S.K - జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ' అనే శక్తివంతమైన లీగల్ డ్రామాను స్ట్రీమింగ్ చేయనుంది. ఆగస్టు 15 నుండి ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులోకి రానుంది. సంక్రాంతికి వస్తున్నం, రాబిన్‌హుడ్, భైరవం వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ZEE5 తెలుగు అందిస్తున్న మరో గొప్ప చిత్రం ఇది.ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ) న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో న్యాయం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఈ పోరాటంలో జానకి విజయం సాధించిందా లేదా అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయని ట్రైలర్ తెలియజేస్తోంది. గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రెనదివే సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చింది. ఉత్కంఠభరితమైన ఈ కోర్టు డ్రామాను ఆగస్టు 15న ZEE5లో వీక్షించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంజాయ్ చేయవచ్చని సంస్థ తెలిపింది.
Latest News