|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 07:54 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో విడుదల కానున్న 'కూలీ' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధమవుతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగష్టు 14, 2025న పెద్ద స్క్రీన్‌లను తాకనుంది. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ శృతి హస్సన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో అమిర్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లభిస్తుంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ ఆగష్టు 2న విడుదల కానుంది. ఈ ఈవెంట్ ని చెన్నైలోని జవహర్లాల్ నెహ్రు ఇన్డోర్ స్టేడియంలో మేకర్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ని రేపు రాత్రి 7 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సౌబిన్ షాహిర్, నాగార్జున, సత్య రాజ్, మహేంద్రన్, రెబా మోనికా జాన్ మరియు కిషోర్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీత స్కోర్‌ను ప్రఖ్యాత అనిరుధ్ రవిచందర్ స్వరపరిచారు.
Latest News