|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 10:46 AM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ కు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలను చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ సినిమాలలో ఫైట్స్ భిన్నంగా ఉంటాయని నిర్మాత ఏఎం రత్నం గుర్తుచేశారు.‘‘పవన్ కల్యాణ్ హీరోగా, దర్శకుడిగా సత్యాగ్రహి టైటిల్ తో గతంలో ఓ సినిమాను ప్లాన్ చేశా. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ను తీసుకున్నా. పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేసి షూటింగ్ ప్రారంభించాం. కానీ ఆ తర్వాత సినిమా ఆగిపోయింది. అప్పుడు ఆ సినిమా చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సమయంలో ఇదే విషయం పవన్ కల్యాణ్ కు గుర్తుచేశా. దీనికి ఆయన నవ్వి.. ‘అవును సత్యాగ్రహి చేస్తే సూపర్ హిట్ అయ్యేది. అప్పుడు నేను సినిమాలు తీసుకుంటూ ఉండేవాడిని. రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు’ అన్నారు’’ అని ఏఎం రత్నం చెప్పారు.
Latest News