|
|
by Suryaa Desk | Sat, Jul 19, 2025, 08:12 PM
లేడీ సూపర్ స్టార్ నయనతార.. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఆమె ఒకరు. ఎలాంటి హీరో లక్షణాలు లేకపోయినా డబ్బు ఉంటే చాలు హీరో అవ్వొచ్చు. దీన్ని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. అందులో శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ ఒకరు. హీరో అవ్వాలి అనే ఆశతో 2022లో ‘ది లెజెండ్’ అనే మూవీ చేశాడు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేల్లా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ కోసం కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టారు. ప్రభు, వివేక్, సుమన్, యోగిబాబు, నాజర్ వంటి స్టార్ నటులంతా ఈ మూవీలో భాగం అయ్యారు. కానీ ఏం లాభం సినిమా డిజాస్టర్ అయింది. అయితే తాజాగా శరవణ అండ్ నయనతార కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది..ఏంటీ అంటే.. శరవణ తన రెండో సినిమా పనులు మొదలు పెట్టాడు. అయితే మొదటి సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశిని తీసుకొచ్చిన శరవణన్, తన రెండో సినిమా కోసం కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ నయన్‌తారని ప్లాన్ చేశాడట. ఇప్పటకే శరవణన్ టీమ్, నయనతారని కలిసి సినిమా గురించి చర్చించిందని సమాచారం. అంతే కాదు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుంటే, ఎంత రెమ్యూనరేషన్ అడిగితే, అంత ఇచ్చేందుకైనా రెడీ అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ రూ.100 కోట్లు ఇచ్చినా సరే, శరవణన్‌తో సినిమా చేయనని తేల్చి చెప్పేసిందట నయనతార.2022లో విడుదలైన ఈ డిజాస్టర్ అయ్యింది. అయితే తన లో నయనతారను కథానాయికగా తీసుకోవాలని భావించాడట. కానీ ఆ అవకాశాన్ని నయన్ సున్నితంగా రిజెక్ట్ చేసిందని సమాచారం.
Latest News