|
|
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 02:48 PM
బాలీవుడ్ లోని ప్రముఖ ఫ్రాంచైజ్ లో 'డాన్' ఒకటి. ఇటీవలే మేకర్స్ డాన్ ఫ్రాంచైజ్ యొక్క అత్యంత ఉహించిన మూడవ విడతని ప్రకటించారు. రణవీర్ సింగ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా రిపోర్ట్స్ ప్రకారం, దర్శకుడు ఈ చిత్రం షూటింగ్ ని జనవరి 2026 లో ప్రారంభించి డిసెంబర్ 2026లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా కూడా తారాగణంలో భాగం కావచ్చు అనే బలమైన పుకారు ఉంది. అయినప్పటికీ ఇంకా ఏమీ నిర్ధారించబడలేదు. ఈ సినిమాలో కృతి సనాన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభం కావడంతో అన్ని కళ్ళు ఇప్పుడు అధికారిక ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News