![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 01:59 PM
రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. నటుడు శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్‌ను మూవీ యూనిట్ విడుదల చేశారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్ ‘గౌర్నాయుడు’ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్రేస్‌ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉన్న ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా, ‘పెద్ది’గా ఇప్పటికే చరణ్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది.రామ్‌చరణ్ 16వ చిత్రంగా ఇది సిద్ధమవుతోంది. జాన్వీకపూర్ కథానాయిక. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఫిక్షనల్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు బుచ్చిబాబు ఓ సందర్భంలో చెప్పారు.
Latest News