![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 10:08 AM
గబ్బర్‌సింగ్ తన జీవితాన్ని మార్చేసిందని స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కోలివుడ్ తర్వాత తనకు సక్సెస్‌ను ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీనే అని అన్నారు. అయితే ప్రస్తుతం శృతి సీనియర్ హీరో రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీలో హీరోయిన్‌గా అలరించనుంది. కూలీ’ సినిమా గురించి మాట్లాడుతూ ‘తమిళ సినిమాకు మా నాన్న, రజనీకాంత్ రెండు కళ్లు లాంటివారు. ఇన్నాళ్లూ రజనీ అంకుల్‌ని మా నాన్న దృష్టికోణంలోనే చూశాను. ఇప్పుడు ఆయనతో డైరెక్టర్‌గా వర్క్ చేస్తుంటే ఆయనెందుకు సూపర్‌స్టార్ అయ్యారో అర్థమైంది. రజనీసార్ ఎనర్జీకి ఎవరూ సరితూగరు. అమితాబ్, కమల్‌హాసన్, రజనీకాంత్.. ఈ ముగ్గురినీ ఒకరితో ఒకర్ని పోల్చలేం. ముగ్గురూ ముగ్గురే.’ అంటూ శృతిహాసన్ పేర్కొన్నారు.
Latest News