![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 10:06 AM
‘ది గుడ్ వైఫ్’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించిన నటి ప్రియమణి, తాజాగా తన కెరీర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటిగా తాను పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని పేర్కొన్న ఆమె, త్వరలో దర్శకురాలిగా మారాలనే ఆసక్తి ఉందని వెల్లడించారు. కథలు చెప్పడం, విజన్‌ను తెరపై చూపించడంలో ఆసక్తి పెరిగిందని తెలిపారు. అనుకూలమైన సమయం వచ్చినప్పుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తానని ఆమె తెలిపారు.
Latest News