![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 06:22 PM
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ స్టైల్‌కి, తన ఎనర్జీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెరపై ఎంత చురుకుగా కనిపిస్తాడో, నిజ జీవితంలోనూ అంతే వైభవంగా, చలాకీగా ఉంటాడు. ఇటీవలే ఆయన దురందర్ అంటూ తన అప్‌కమింగ్ మూవీ టీజర్ విడుదలవగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే.. ఇప్పుడు ఆయన ఓ విలాసవంతమైన కారును కొనుగోలు చేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పటికే తన వద్ద, భార్య దీపిక వద్ద ఓ డజన్ వరకు కకరీదైన కార్లు ఉండగా కొత్తగా ఇప్పుడు మరో కారు ఇంట్లోకి వచ్చింది.సినిమా పరంగా ఎంత బిజీగా ఉన్నా, వ్యక్తిగత జీవితం విషయంలో తనదైన విభిన్న శైలితో ముద్ర వేసే. రణ్ వీర్ సింగ్ తాజాగా తన జన్మదినం సందర్భంగా సుమారు రూ.5 కోట్ల విలువ గల హమ్మర్ కంపెనీకి చెందిన స్పెషల్ ఎడిషన్ ఈవీ లగ్జరీ కారు Hummer (EV 3X Car)ను తన కలెక్షన్‌లోకి చేర్చుకున్నారు. ఈ కారుకు సంబంధించిన వివరాలను CS12 Vlogs యూట్యూబ్ ఛానల్‌లో ఓ యూట్యూబర్ తెలిపారు. రణ్ వీర్‌కి చెందిన Maybach GLS600 కారు ఒక ఇంటి నుంచి బయటికి వస్తుండగా, అదే సమయంలో ఫ్రైడే నైట్ కార్స్ సంస్థ ప్రత్యేక వాహానంలో రెండు హమ్మర్ EVలతో అక్కడికి వచ్చి అందులో ఒకటి రణ్ వీర్‌కు డెలివరీ ఇచ్చినట్లు ఆ వీడియోలో వివరించారు.
Latest News