![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 03:42 PM
టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా "నరివెట్ట" ఓటీటీలో ముందుగానే విడుదలైంది. సోనీలివ్ వేదికగా జూలై 11న స్ట్రీమింగ్ కావాల్సిన ఈ సినిమా, ఒక రోజు ముందే అందుబాటులోకి వచ్చింది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఆడియోల్లో వీక్షించొచ్చు. ముత్తంగ ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో టొవినో పోలీస్ కానిస్టేబుల్‌గా నటించారు. సూరజ్ వెంజరమూడు, చేరన్ కీలక పాత్రలు పోషించారు.
Latest News