![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 09:47 AM
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల ఆరోపణలపై సీనియర్ నటి సుధ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేధింపులకు గురయ్యామని చెప్పే మహిళలు, తమ ప్రవర్తనను కూడా సమీక్షించుకోవాలని, అవకాశం ఇవ్వకుండా ఎవరూ అడ్వాంటేజ్ తీసుకోరని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, ఎదుటివారు మనతో ప్రవర్తించే తీరు మన చేతుల్లోనే ఉంటుందని అన్నారు. "గోడకు బంతి ఎంత గట్టిగా కొడితే, అది అంతే వేగంతో తిరిగి వస్తుంది. అలాగే మన ప్రవర్తనను బట్టే ఎదుటివారి స్పందన ఉంటుంది. మీరు అవకాశం ఇస్తేనే వాళ్లు అడ్వాంటేజ్ తీసుకుంటారు. సూదికి దారి ఇవ్వకుండా దారం ఎలా దూరుతుంది?" అని ఆమె ప్రశ్నించారు.కొన్ని సంఘటనలు జరిగిన వెంటనే స్పందించకుండా, ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మాట్లాడటాన్ని ఆమె తప్పుబట్టారు. ఏ విషయంలోనైనా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే ఒక నిర్ధారణకు రావాలని, ఒక్కరి మాట నమ్మి మరొకరిని దోషిగా చూడకూడదని సుధ అభిప్రాయపడ్డారు. "మీరు ఎందుకు అవకాశం ఇచ్చారు? అప్పుడే ఎందుకు ఎదురు తిరగలేదు?" అని ప్రశ్నించుకోవాలని సూచించారు.తన ఆలోచనలను 'ఓల్డ్ స్కూల్' అని విమర్శించినా పట్టించుకోనని, ఆ పద్ధతిలోనే ఉండటం తనకు ఇష్టమని ఆమె స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా మొబైల్ ఫోన్ల వాడకం పెరిగాక మంచి కంటే చెడు మార్గంలోనే ఎక్కువగా పయనిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News