![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 09:44 AM
నితిన్ కథానాయకుడిగా దిల్ రాజు బ్యానర్ పై రూపొందిన సినిమానే 'తమ్ముడు'. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, థియేటర్లకు వచ్చింది. చాలా కాలం తరువాత 'లయ' రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. నితిన్ సరైన హిట్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఎదురుచూస్తున్న హిట్, ఈ సినిమాతో వస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ: జై (నితిన్) ఆర్చరీ క్రీడాకారుడు. దేశానికి తాను బంగారు పతకం తీసుకురావాలనే పట్టుదలతో ఉంటాడు. అయితే కొంతకాలంగా అతని ఏకాగ్రత దెబ్బతింటూ ఉంటుంది. తనని చిన్నతనంలో వదిలేసి వెళ్లిపోయిన అక్కయ్య స్నేహలత (లయ) గుర్తొస్తూ ఉండటమే అందుకు కారణమని భావిస్తాడు. అక్కయ్య విషయంలో తాను చేసిన పని అతనికి 'గిల్ట్' గా ఉంటుంది. అక్కను కలిసి సారీ చెప్పి .. ఆమెతో తమ్ముడూ అని పిలుపించుకుంటే తప్ప, తన ఏకాగ్రత కుదరదని భావిస్తాడు. తన ఫ్రెండ్ చిత్ర (వర్ష బొల్లమ్మ)ను తీసుకుని బయల్దేరతాడు. తన అక్కయ్యను వెతుక్కుంటూ వెళ్లిన 'జై'కి, ఆమె 'ఝాన్సీ'గా పేరు మార్చుకుందని తెలుస్తుంది. తన ఫ్యామిలీతో కలిసి, 'అంబర గొడుగు'లో జరుగుతున్న జాతరకి ఆమె వెళ్లిందని అతను తెలుసుకుంటాడు. అక్కడే ఆమెను కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ గ్రామానికి వెళతాడు. అది ఒక అడవీ ప్రాంతం. ఏ రాష్ట్ర పరిధిలోకి రానటువంటి ప్రత్యేకమైన ప్రదేశం. అలాంటి ఆ ప్రదేశానికి జై చేరుకుంటాడు. స్నేహలత ఫ్యామిలీ అంతా కూడా ప్రమాదంలో ఉందనే విషయం, అక్కడికి వెళ్లిన తరువాతనే 'జై'కి అర్థమవుతుంది. అప్పటికే ఆ ఫ్యామిలీని శత్రువులు చుట్టుముడతారు. తన వాళ్లను సురక్షితంగా అంబరగొడుగు దాటించాలని 'జై' నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అతని అక్కయ్య ఫ్యామిలీకి హాని తలపెట్టింది ఎవరు? అక్క ప్రేమను పొందాలనే జై కోరిక నెరవేరుతుందా? అనేది కథ.
Latest News