|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 03:33 PM
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రం గురించి పలు ఆసక్తికర, సంచలన విషయాలను బయటపెట్టారు. ఆ సినిమా కోసం హీరోయిన్‌ను వెతకడం ఎంత కష్టమైందో, చివరికి 'దంగల్' సినిమాలో తన కూతురిగా నటించిన ఫాతిమా సనా షేక్‌ను ఎంపిక చేయడానికి దర్శకనిర్మాతలు ఎంత వెనుకాడారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.'ది లల్లన్‌టాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ, 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం తాము పడిన ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. "ఆ సినిమాలోని హీరోయిన్ పాత్రను అంగీకరించడానికి ఏ నాయికా ముందుకు రాలేదు. దీపికా పదుకొణె, ఆలియా భట్, శ్రద్ధా కపూర్.. ఇలా ఇండస్ట్రీలోని దాదాపు ప్రతీ హీరోయిన్‌కు ఆ అవకాశం ఇచ్చాం. కానీ ఎందుకో ఆ ఒక్క పాత్రకు ఎవరూ ఓకే చెప్పలేదు. ఇది అప్పట్లో నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య (విక్టర్)కు పెద్ద సమస్యగా మారింది" అని ఆమిర్ తెలిపారు.
Latest News