![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 03:41 PM
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి "ది రాజా సాబ్" అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం సినీ ప్రేమికులలో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తుంది. ఈ చిత్రం రొమాంటిక్ హారర్ జానర్‌లో వస్తుంది అని టాక్. ఈ చిత్రం యొక్క చివరి షెడ్యూల్ జూలై మొదటి వారంలో ప్రణాళిక చేయబడింది. బృందం హైదరాబాద్‌లో నిర్మించిన ప్యాలెస్ సెట్‌లో క్లైమాక్స్‌ను చిత్రీకరించనుంది. షూట్ పూర్తి చేసిన తరువాత మారుతి మరియు బృందం వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయడానికి పోస్ట్ ప్రొడక్షన్‌పై పని చేయనున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, సత్యరాజ్, జరీనా వహాబ్, వరలక్ష్మి శరత్‌కుమార్, యోగి బాబు, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.
Latest News