![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 08:47 AM
బాహుబలి 2: టాలీవుడ్‌లోని అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటైన బాహుబలి భారతీయ సినిమా పెద్ద కలలు కనడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి మార్గం సుగమం చేసింది. ఎస్ఎస్ రాజమౌలి యొక్క సినిమా మాస్టర్ పీస్ బాహుబలి 2 బాక్సాఫీస్ వద్ద 1,700 కోట్లు వాసులు చేసింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో జూన్ 29న ఉదయం 8 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు ఛానల్ ప్రకటించింది. ప్రభాస్, రానా దబ్బూబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, సత్యరాజ్, రోహిని, తానికేల్లా భరణ్, అడివి శేష్, నాజర్, సుబ్బరాజు మరియు ఇతరులు ఈ సినిమాలో నటించారు. అర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.
బాపు: దయా రచన మరియు దర్శకత్వంలో బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన 'బాపు' చిత్రం ఫిబ్రవరి 21న విడుదల అయ్యింది. ఈ డార్క్ కామెడీ-డ్రామా యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం జూన్ 29న మధ్యాహ్నం 1 గంటకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల మరియు అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజు మరియు భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమానిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందింది. వాసు పెండెమ్ (సినిమాటోగ్రఫీ), ఆర్ఆర్ ధ్రువన్ (మ్యూజిక్) మరియు అనిల్ ఆలయం (ఎడిటింగ్) తో కూడిన సాంకేతిక బృందం ఉంది. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
డ్రాగన్: కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' తో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ చేశాడు. అశ్వత్ మారిముతు దర్శకత్వం వహించిన డ్రాగన్ తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో విడుదల చేయబడింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జూన్ 29న సాయంత్రం 6 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. కయాడు లోహర్, అనుపమ పరమేశ్వరన్ మహిళా ప్రధాన పాత్ర పోషించారు. AGS ఎంటర్టైన్మెంట్ ఈ యూత్ కామెడీ ఎంటర్టైనర్ను నిర్మించింది. ప్రముఖ కోలీవుడ్ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరియు మైస్కిన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి లియోన్ జేమ్స్ ట్యూన్స్ కంపోజ్ చేశాడు.
Latest News