![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 04:13 PM
చిన్న-బడ్జెట్ తమిళ చిత్రం 'మామన్' బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. ఈ చిత్రంలో సూరి ప్రధాన పాత్రలో నటించగా, ఐశ్వర్య లక్ష్మి మహిళా ప్రధాన పాత్రలో నటించింది. సూరి కోలీవుడ్‌లో తన స్థానాన్ని బ్యాంకిబుల్ హీరోగా ఉన్నాడు మరియు మామన్ దీనికి మంచి ఉదాహరణ. ఈ సినిమా యొక్క డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ని జీ5 తమిళ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ5 తమిళలో త్వరలో స్మాల్ స్క్రీన్ మరియు డిజిటల్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ప్రశాంత పాండియరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్వశిక, రాజ్ కిరణ్, నిఖిల, గీత మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ ట్యూన్స్ కంపోజ్ చేశారు.
Latest News