![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 03:13 PM
కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ రానున్న పాన్-ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ అయిన "గగన మార్గన్"లో తదుపరి కనిపించనున్నారు. ఈ పాన్-ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రఖ్యాత ఎడిటర్ లియో జాన్ పాల్ దర్శకత్వ అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాలోని ఫస్ట్ 6 నిమిషాల వీడియోని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా అజయ్ ధిషన్ నాటిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా సాగా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు ఎవరు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్‌గా విజయ్ ఆంటోని ఉన్నారు. ఈ సినిమా జూన్ 27న విడుదలకి సిద్ధంగా ఉంది. విజయ్ ఆంటోని హోమ్ బ్యానర్, విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్‌పై 12వ ప్రొడక్షన్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News