![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 12:37 PM
ఉదయ్ కిరణ్... ఈ పేరు తెలుగు సినిమా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన పేరు. ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26న హైదరాబాద్‌లో వి.వి.కె. మూర్తి, నిర్మల దంపతులకు జన్మించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అతను, సికింద్రాబాద్‌లోని వెస్లీ కళాశాలలో కామర్స్ డిగ్రీ చేశారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉన్న ఉదయ్.. చదువుతో పాటు మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. ఈ అవకాశం అతన్ని సినీరంగంలోకి తీసుకొచ్చింది. చిత్రం సినిమాతో తొలి అడుగు వేసి.. లవర్ బాయ్ ఇమేజ్‌తో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నారుచిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టి, తన మొదటి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్స్ సాధించి "హ్యాట్రిక్ హీరో" అనే బిరుదు సంపాదించాడు. అయితే కొందరు నటులు తమ నటనతో సూపర్‌స్టార్లుగా ఎదిగితే .. మరికొందరు మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ కోవకి చెందినవారే హీరో ఉదయ్ కిరణ్. 2025, జూన్ 26న ఆయన జయంతి. ఉదయ్ కిరణ్ 2003లో మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మితతో నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వివాహం జరగలేదు. అయితే 2012 అక్టోబర్ 24న విషితను ఉదయ్ కిరణ్ వివాహం చేసుకున్నారు. విషిత ఫేస్‌బుక్‌లో ఉద్యోగి. వారు హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో త్రీ బెడ్‌రూమ్ ప్లాట్‌లో నివసించేవారు.
Latest News