|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 04:28 PM
సూర్య ప్రధాన పాత్రలో, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘రెట్రో’ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. తాజాగా, ఈ సినిమాను ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా వెబ్‌సిరీస్ రూపంలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ మేరకు ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు దర్శకుడు సుబ్బరాజు వెల్లడించారు. త్వరలోనే దీన్ని సిరీస్ ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపారు.‘రెట్రో’ (Retro) చిత్రాన్ని కేవలం ఒక సినిమాగానే కాకుండా, ఒక సిరీస్ వెర్షన్‌గా కూడా తీసుకురావాలని కార్తీక్ సుబ్బరాజు ఆలోచిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే నాలుగు నెలల్లో ఈ సిరీస్ వెర్షన్‌ను విడుదల చేయాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌లో కేవలం తొలగించిన సన్నివేశాలు మాత్రమే కాకుండా, అనేక భావోద్వేగపూరిత సన్నివేశాలు మరింత వివరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నానని ఆయన తెలిపారు. సినిమాలోని పాత్రల లోతును, వాటి మధ్య సంబంధాలను మరింత విపులంగా చూపించాలనేది సుబ్బరాజు ఆలోచనగా తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్ సుముఖంగా లేదని, అందుకే వారితో చర్చలు జరుపుతున్నానని సుబ్బరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌తో జరుగుతున్న చర్చలు విజయవంతమైతే, ‘రెట్రో’ అభిమానులకు మరింత వినోదాన్ని పంచే అవకాశం ఉంది.
Latest News