|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 03:59 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాలు పెంచుకుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ Netflix రూ.105 కోట్లకు కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. చెర్రీ రగ్గడ్ లుక్‌లో కనిపించే ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.'పెద్ది' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ 110 కోట్లు అనేది కేవలం బేస్ ప్రైజ్ మాత్రమే. థియేటర్ల నుంచి వచ్చే కలెక్షన్లు బట్టి ఈ వ్యాల్యూ ఇంకా పెరుగుతుందని టాక్. ఉదాహరణకు తెలుగులో 250 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే ఒక రేటు, హిందీలో 100 కోట్ల కలెక్షన్లు దాటితే ఒక రేటు, 200 కోట్ల కలెక్షన్లు దాటితే మరొక రేటు అనే విధంగా డీల్ సెట్ చేశారట. రూ. 110 కోట్లు అనేది మినిమమ్. థియేటర్లలో హిట్ అయ్యే దాన్నిబట్టి డీల్ వాల్యూ మరింత పెరుగుతుంది. ఈ సినిమా ఆడియో రైట్స్ టీ సిరీస్ సంస్థ తీసుకుంది. ఆ డీల్ వేల్యూ 50 కోట్లు ప్లస్ అని టాక్.
Latest News