|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 02:34 PM
టాలీవుడ్ స్టార్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో.. టాప్ మోస్ట్ దర్శకుడిగా మారిన వారిలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారు. కింది స్థాయి నుంచి పైకి వచ్చారు రాజమౌళి. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీని ఆస్కార్ రేంజ్ కు తీసుకువెళ్లారు. ఆయన తీసిన ప్రతి సినిమా బంపర్ విజయాన్ని నమోదు చేయడమే కాదు... చాలా రికార్డులను బద్దలు కొట్టాయి. ఆయన సినిమా తీస్తే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడతాయి కానీ... సినిమా కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు రాజమౌళి. అయితే అలాంటి రాజమౌళి మొదటి రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తాను మొదటి రెమ్యూనరేషన్ కేవలం 50 రూపాయలు మాత్రమే తీసుకున్నానని... స్వయంగా దర్శక ధీరుడు రాజమౌళి ప్రకటించారు. ఆ సమయంలో... అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేస్తున్నట్లు కూడా వివరించారు. అక్కినేని నాగార్జున, హీరో ధనుష్, రష్మిక మందన కాంబినేషన్ లో కుబేర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నారు రాజమౌళి. తన మొదటి జీతంతో... ఏం చేశానో కూడా గుర్తు లేదని వివరించారు. సిద్ధాంతాలకు కట్టుబడి దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలు చేస్తున్నారని ప్రశంసించారు రాజమౌళి. కానీ తాను మాత్రం అలా సిద్ధాంతాలకు కట్టుబడి లేనని.. నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
Latest News