|
|
by Suryaa Desk | Wed, Jun 11, 2025, 03:04 PM
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రానున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. చిత్రబృందం ఓ అప్‌డేట్‌ను పంచుకుంది. దీని వీఎఫ్‌ఎక్స్ పనులు కూడా పూర్తయినట్లు వెల్లడించింది. విజువల్ వండర్‌గా ఈ సినిమా రానుందని దీని వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేసిన సంస్థ వెల్లడించింది. పనులు పూర్తయినట్లు తెలుపుతూ ఫొటో షేర్ చేసింది. టీమ్‌లోని వారంతా అంకితభావంతో రెండున్నర ఏళ్లకు పైగా దీనికోసం వర్క్ చేసినట్లు తెలిపింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేక్షకుడు సినిమాటిక్ అనుభూతిని పొందుతారని.. దర్శకుడు ఎంతో అద్భుతంగా దీన్ని రూపొందించారని సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని వీఎఫ్‌ఎక్స్‌ను చూసి ఆనందించడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు వీఎఫ్‌ఎక్స్ పనులు కూడా పూర్తికావడంతో ఫైనల్ రిలీజ్ డేట్‌పై త్వరలోనే ప్రకటన రావచ్చని అభిమానులు భావిస్తున్నారు. కనువిప్పు కలిగించే చిత్రమిది.. ఆమిర్ సినిమాకు రివ్యూ ఇచ్చిన సుధామూర్తిఈ సినిమాని క్రిష్ కొంతభాగం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రొడ్యూసర్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. పవన్ ఇందులో చారిత్రక యోధుడిగా మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలిభాగం 'హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో విడుదల కానుంది.
Latest News