|
|
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 08:29 PM
కొంతకాలంగా రీ-రిలీజ్ సినిమాల సందడి కొనసాగుతోంది. ఈ శుక్రవారం కూడా రీ-రిలీజ్ మూవీ ఒకటి జనం ముందుకు వస్తోంది. 2012 ఆగస్ట్ 10న విడుదలైన 'అందాల రాక్షసి' సినిమాను ఇప్పుడు మరోసారి జనం ముందుకు తీసుకొస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. దర్శకుడితో సహా వీళ్ళంతా ఇప్పుడు మంచి పొజిషన్ కు చేరుకున్నారు. అప్పట్లో 'అందాల రాక్షసి' మంచి విజయాన్నే అందుకుంది. అలానే రవితేజ, స్నేహ జంటగా నటించిన 'వెంకీ' సినిమా కూడా శనివారం మరోసారి జనం ముందుకు రాబోతోంది. ఇది గతంలోనూ రీ-రిలీజ్ అయ్యింది. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు ఏమీ లేని కారణంగా మేకర్స్ మరోసారి దీన్ని రిలీజ్ చేస్తున్నారు.సో.. ఓవర్ ఆల్ గా చూసుకుంటే... అయిదు అనువాద చిత్రాలతో పాటు రెండు రీ-రిలీజెస్ ఇప్పటి వరకూ వీకెండ్ బెర్త్ ను కన్ ఫార్మ్ చేసుకున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఇంకేమైనా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతాయేమో చూడాలి.
Latest News