|
|
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 08:30 PM
వార్-2 చిత్రం తారక్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదల చేయగా దానికి చక్కని స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. టీజర్‌లో ఎన్టీఆర్ లుక్, స్టైలింగ్ అదిరిందనే ప్రశంసలు వచ్చాయి. ఆ క్రెడిత్ మొత్తం అనైతా ష్రాఫ్ అడజానియాకే దక్కుతుంది. తన కాస్ట్యూమ్స్‌కి, తన పని తనానికి వచ్చిన ప్రశంసని, అభిమానుల నుంచి వచ్చిన ప్రేమను చూసి ‘వార్ 2’ కాస్ట్యూమ్ డిజైనర్ ఆనందంతో మునిగి తేలుతున్నారు. దేశంలోనే అత్యుత్తమ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన అనైతా ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Latest News