|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 08:02 PM
ప్రముఖ దర్శకుడు త్రివిక్రామ్ శ్రీనివాస్ ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం' తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న విక్టరీ వెంకటేష్‌తో ఒక సినిమాని చేస్తున్నట్లు సమాచారం. వెంకటేష్ మరియు త్రివిక్రామ్ కుటుంబ ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. ఈ సినిమా మల్టీస్టారర్ అని టాక్. మరొక ప్రధాన పాత్రలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని సెలెక్ట్ చేసినట్లు టాక్. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాని మూవీ మేకర్స్ జూన్ 6న ఆఫీసియల్ గా అనౌన్స్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. సూర్యదేవర రాధకృష్ణ హారికా మరియు హాసిన్ క్రియేషన్స్ పతాకంపై ఈ బిగ్గీని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన కీలక అప్డేట్స్ ని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News