|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 07:40 PM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదల విషయంలో చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులు కుట్ర పన్నారని నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త కార్యదర్శి నట్టి కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తక్కువ ధరకు దక్కించుకునేందుకే థియేటర్ల బంద్ నాటకం ఆడారని ఆయన ఆరోపించారు. ఈ కుట్ర వెనుక అల్లు అరవింద్, సురేశ్ బాబు, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.నట్టి కుమార్ మాట్లాడుతూ, "జూన్ 12న 'హరిహర వీరమల్లు' సినిమా విడుదల అవుతుందని అందరికీ తెలుసు. ఇప్పటికే ఈ సినిమా ఆలస్యమైంది, నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని కూడా తెలుసు. అయినప్పటికీ, సినిమాను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు పెద్దలు పథకం వేశారు," అని అన్నారు."ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్ ఈ ముగ్గురూ కలిసి ఈ కుట్ర చేశారు. దీనికి దిల్ రాజు, సునీల్ నారంగ్ కూడా సహకరించారు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్లు మే 18న అకస్మాత్తుగా ప్రకటించారు. నిజానికి మే 14న జరిగిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మీటింగ్‌లో కూడా ఈ బంద్ ప్రస్తావన రాలేదు. కేవలం 'హరిహర వీరమల్లు' డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో లబ్ధి పొందడానికే ఈ బంద్ డ్రామా ఆడారు," అని నట్టి కుమార్ వివరించారు.
Latest News