|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 07:34 PM
కొత్తదనం ఉంటే నూతన తారల చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఈ విషయాన్ని గతంలో నూతన తారలు నటించిన చాలా సినిమాల విజయాలు ఈ విషయాన్ని నిరూపించాయి. తాజాగా ఈ కోవలోనే నూతన నటీనటులతో రూపొందిన చిత్రం 'ఒక బృందావనం' ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందిందా? ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉందా? లేదా తెలుసుకుందాం.
కథ: అమెరికాకు వెళ్లి స్థిరపడాలని కలలు కనే రాజా విక్రమ్ (బాలు) ఓ ఈవెంట్ సంస్థలో కెమెరామెన్‌గా పనిచేస్తుంటాడు. అమెరికాకు వెళ్లాలని, అందుకోసం డబ్బు సంపాందించాలని విక్రమ్ ప్రయత్నిస్తుంటాడు. తండ్రి (వంశీ నెక్కంటి) పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడని తెలుసుకోని తన ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా కొంత మంది వ్యక్తుల లైఫ్ జర్నీని ఓ డాక్యుమెంటరీ తీయాలని మహీ (షిన్నోవా) ఇంటి నుంచి బయటికి వచ్చేస్తుంది. అనుకోకుండా తనకు పరిచయమైన విక్రమ్‌ను ఈ డాక్యుమెంటరీని షూట్ చేయడానికి కెమెరామెన్‌గా పెట్టుకుంటుంది మహీ. తన అమెరికా వెళ్లడానికి కావాల్సిన డబ్బు కోసం ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతాడు విక్రమ్. అనాథశ్రమంలో ఉండే చిన్నారి నైనిక (సాన్విత) జోసెఫ్‌ను (శుభలేఖ సుధాకర్) అన్వేషిస్తుంది. అయితే నైనిక స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించడంతో ఆమె గురించి డాక్యుమెంటరీ తీయాలని ప్లాన్ చేస్తుంది మహీ. అయితే అమెరికా వెళ్లాలనుకున్న రాజా విక్రమ్ కల ఫలించిందా? ఇంతకు జోసెఫ్ ఎవరు? అతడిని నైనిక ఎందుకు కలవాలని అనుకుంటుంది. రాజా, మహీ జర్నీ నైనికతో ఎలా కొనసాగింది? తెలియాలంటే సినిమా చూడాలి.
Latest News