![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:12 PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తొలి డైరెక్టర్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పట్ల తనకున్న గౌరవాన్ని, అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా బన్నీ ఓ ప్రత్యేకమైన కానుక ఇచ్చి ఆయన్ను సర్ప్రైజ్ చేశారు. తన కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద "నా తొలి దర్శకుడు" అనే క్యాప్షన్‌తో రాఘవేంద్రరావు ఫొటోను అల్లు అర్జున్ ఏర్పాటు చేయడం విశేషం.శుక్రవారం రాఘవేంద్రరావు తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. "నా గురువుగారు రాఘవేంద్రరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! నన్ను సినిమాల్లోకి లాంచ్ చేసిన నా తొలి దర్శకుడు. ఎప్పటికీ కృతజ్ఞుడిని" అంటూ గతంలో ఆయనతో కలిసి దిగిన కొన్ని తెరవెనుక చిత్రాలను పంచుకున్నారు. 2003లో వచ్చిన 'గంగోత్రి' సినిమాతో అల్లు అర్జున్ను హీరోగా వెండితెరకు పరిచయం చేసింది రాఘవేంద్రరావు అన్న సంగతి తెలిసిందే. తన సినీ ప్రస్థానానికి మార్గదర్శకులైన గురువు పట్ల బన్నీ చూపిన ఈ ఆత్మీయత పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
Latest News