![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 04:27 PM
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్డమ్' చిత్రం జులై 4, 2025న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ పాన్-ఇండియన్ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో భగ్యాశ్రీ బోర్స్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొంతకాలంగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రంలో విజయ్ స్పై ఏజెంట్గా కనిపించనున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నురి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ కూడా గౌతమ్ రాసుకున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క ఇంటర్వెల్ మూవీకి మెయిన్ హైలైట్ గా ఉండనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ కి ప్రేక్షకులు థ్రిల్ అవుతారని చిత్ర బృందం హామీ ఇస్తుంది. ఈ చిత్రంలో నవ్య స్వామి, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News