|
|
by Suryaa Desk | Sat, Aug 31, 2024, 03:21 PM
విజయ్ టీవీ ఫేం, హాస్య నటుడు పుగళ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఫోర్ సిగ్నల్’ . శ్రీ లక్ష్మీషణ్ముగనాథన్, కేశవ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆర్.మణికంఠన్, మహేశ్వరన్ కేశవన్ నిర్మాణంలో మహేశ్వరన్ కేశవన్ దర్శకత్వం వహించారు. లవ్, సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాను దీపావళి పండుగ సీజన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రతి ఒక్కరూ ఉపయోగించే సాధారణ రవాణా వాహనమైన షేర్ ఆటో చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. చెన్నైలో వివిధ పనుల నిమిత్తం తమ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులు, షేర్ ఆటో డ్రైవర్ మధ్య జరిగే ఆసక్తిక అంశాలే ఈ చిత్ర కథాంశం. ఇతర పాత్రల్లో అరువి తిరునావుక్కరసు, కల్లూరి వినోద్, లొల్లు సభ శేషు, షర్మిల, విజయ్ ఆదిరాజ్ నటించారు. సామాన్యుల జీవితంలో నిత్యం జరిగే సంఘటనల ఆసక్తికరమైన సమాహారంగా తెరకెక్కించామని, నాణ్యమైన కథా చిత్రాలను ఎల్లవేళలా ఆదరించే తమిళ ప్రేక్షకులు తమ చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉందని దర్శకుడు చెప్పారు. బాల పళనియప్పన్ సినిమాటోగ్రఫీ , ఏజే అలిమిర్‌జాక్ సంగీతం అందించారు.
Latest News