|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 05:17 PM
‘బలగం’ లాంటి భారీ విజయం తర్వాత వేణు రెండో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన తన గురువు దిల్ రాజు బ్యానర్‌లోనే ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌ను ప్రకటించి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, ఇంతవరకు హీరో ఎవరనేది ఖరారు కాలేదు. దీంతో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.గతంలో ఈ కథ కోసం ముందుగా హీరో నానిని సంప్రదించారు. కానీ, ఇతర కమిట్‌మెంట్ల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత హీరో నితిన్ పేరు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే ‘తమ్ముడు’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం, బడ్జెట్ సమస్యల కారణంగా నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు ప్రచారం జరిగింది. మధ్యలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు వినిపించినా, అది కేవలం ఊహాగానంగానే మిగిలిపోయింది.ఇలా పలువురు హీరోల పేర్లు పరిశీలనకు వచ్చిన తర్వాత, ఇప్పుడు అనూహ్యంగా దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. డీఎస్పీని హీరోగా చూడాలని చాలాకాలంగా ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు వేణు-దిల్ రాజు కాంబినేషన్‌లో అది నిజం కాబోతోందనే వార్త ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచింది. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానప్పటికీ, ఈ క్రేజీ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు ‘ఎల్లమ్మ’ హీరో ఎవరో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Latest News