|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 05:01 PM
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మరోసారి తన వినయంతో, అభిమానుల పట్ల చూపే ప్రేమతో వార్తల్లో నిలిచారు. నిన్న హైదరాబాద్‌లో జరిగిన 'కె ర్యాంప్' మూవీ ర్యాంపేజ్ ఈవెంట్లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ అభిమాని ఉద్వేగంతో కిరణ్ కాళ్లపై పడటం, దానికి ఆయన స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే... కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'కె ర్యాంప్' చిత్రం రేపు (అక్టోబరు 18) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, చిత్రబృందం గురువారం నాడు హైదరాబాదులో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందులో భాగంగా కిరణ్ అబ్బవరం కూర్చని ఉండగా... ఓ అభిమాని ఒక్కసారిగా ఆయన వద్దకు వచ్చి కాళ్ల మీద పడిపోయాడు. దాంతో, కిరణ్ అబ్బవరం వెంటనే కిందకు వంగి, ఆ అభిమానిని ఎంతో ఆప్యాయంగా పైకి లేపారు. అంతేకాకుండా, అతడి భుజం తట్టి, ప్రేమగా మాట్లాడారు. అక్కడున్న వారు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించడంతో, ఆ వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
Latest News