|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 01:46 PM
టాలీవుడ్, కోలీవుడ్ లో లెజెండరీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అందాల త్రిష పెళ్లి గురించి మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా కోలీవుడ్ సర్కిల్స్‌లో త్రిష పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తల్లిదండ్రులు చూసిన సంబంధానికి ఆమె ఓకే చెప్పిందనే టాక్ నడుస్తుంది. త్రిష తల్లిదండ్రులు చండీఘర్‌కు చెందిన ఓ కుటుంబంతో సంబంధం కుదిర్చినట్లు తెలుస్తోంది. ఆ యువకుడు ఆస్ట్రేలియాలో స్థిరపడి బిజినెస్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై త్రిష నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Latest News