|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 11:23 AM
మలయాళ నటి లక్ష్మీ ఆర్. మీనన్‌కు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 24ఆదివారం రాత్రి కొచ్చిలోని వెలాసిటీ పబ్ కు లక్ష్మీ మీనన్,మిథున్, అనీష్ మరియు సోనమోల్ ఒక బార్ కు వెళ్లారు. ఆ పబ్‌లో గొడవ జరిగింది. ఐటీ ఉద్యోగి అలియార్ షా సలీమ్‌తో వివాదం జరిగింది. బార్‌లో రెండు గ్రూప్‌ల మధ్య గొడవ జరిగిందని, బయటకు వచ్చాక కూడా కొనసాగిందని సలీమ్ తెలిపారు. తాను, తన స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించినప్పుడు లక్ష్మీ మేనన్, ఆమె ఫ్రెండ్స్ తమపై దాడికి యత్నించారని ఆరోపించారు. తమ వాహనాన్ని ఫాలో చేసి... రాత్రి 11:45 గంటల సమయంలో నార్త్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి సమీపంలో కారును ఆపి బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లినట్టుగా ఆరోపణలు చేశారు. అలాగే వారి వాహనంలోకి తీసుకెళ్లి, దాడికి పాల్పడ్డారని, తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని కూడా సలీమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తరువాత తనను అలువా–పరవూర్ జంక్షన్‌లో వదిలిపెట్టినట్టుగా ఐటీ ఉద్యోగి అలియార్ షా సలీమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఐటీ ఉద్యోగి అలియార్ షా సలీమ్ ఫిర్యాదు పోలీసులు లక్ష్మీ మీనన్‌పై కిడ్నాప్ (సెక్షన్ 140(2)), అక్రమ నిర్బంధం (సెక్షన్ 127(2)), దాడి (సెక్షన్ 115(2)), నేరపూరిత బెదిరింపులు (సెక్షన్ 351(2)) సహా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), 2023 కింద పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలువాకు చెందిన మిథున్, పరవూర్‌కు చెందిన అనీష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని... ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని లక్ష్మీ మీనన్ తన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో నటి లక్ష్మీ మేనన్‌ను విచారించాలని పోలీసులు భావించారు.ఇంతలో ఆమె కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది.
Latest News