|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 02:46 PM
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ లో దీపికా పదుకొనే నటించడం లేదని ఆమె స్థానంలో కోలీవుడ్ నటి సాయిపల్లవి నటించబోతుందని పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో నాగ్ అశ్విన్ సాయిపల్లవితో ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా తీయాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అది కల్కి సినిమానా లేకపోతే వేరే సినిమానా అనేది తెలియాల్సి ఉంది.
Latest News