|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 09:16 PM
'పోలీస్ పోలీస్' ఓ తమిళ వెబ్ సిరీస్. టైటిల్ ను బట్టే ఈ కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుందనే విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. థాయ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సిరీస్ కి 'కోన్' దర్శకత్వం వహించాడు. యాక్షన్ తో కూడిన కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్, 4 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: మదురై పోలీస్ స్టేషన్ లో రాజా ఎస్.ఐ.గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఎస్.పి.గా ఆర్తన (సుజిత) ఉంటుంది. ఈ ఇద్దరూ అక్కాతమ్ముళ్లు. మొదటి నుంచి కూడా రాజాకి ఆవేశం .. దూకుడు ఎక్కువ. ఫలితంగా డిపార్టుమెంటు నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్తన ఫేస్ చేస్తూ ఉంటుంది. ఆవేశాన్ని.. తొందరపాటును తగ్గించుకోమని రాజాకి చెబుతూ ఉంటుంది. అయితే రాజా మాత్రం తనదైన దారిలో ముందుకు వెళుతూనే ఉంటాడు. అదే పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆఫీసర్ గా ఉన్న 'వావర్', రాజాపై పోటీగా ఉంటాడు. రాజాను క్రాస్ చేసే వెళ్లే అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రాజా కోపం వావర్ కి మేలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం ఆర్తన దృష్టికి కూడా వస్తుంది. రాజాను హెచ్చరించడం కోసం అతని భార్యాపిల్లలను గుర్తుచేస్తూ ఉంటుంది. అయినా అతను తన తీరు మాత్రం మార్చుకోడు. ఇక అదే ఊళ్లో మురళి అనే యువకుడు తన బామ్మతో కలిసి నివసిస్తూ ఉంటాడు. అతని బామ్మ శివగామి, ఒక గుడి దగ్గర పూలకొట్టు నడుపుతూ ఉంటుంది. ఎస్.ఐ. కావాలనుకున్న మురళి, కొన్ని కారణాల వలన జైలుకు వెళ్లొస్తాడు. అందువలన అతనికి ఎక్కడా ఏ పనీ దొరక్కుండా పోతుంది. అలాంటి పరిస్థితులలోనే ఒక లాయర్ తో అతనికి పరిచయమవుతుంది. పోలీస్ ఆఫీసర్ రాజా నేపథ్యం ఏమిటి? మురళి ఎందుకు జైలుకు వెళ్లొచ్చాడు? లాయర్ తో అతని పరిచయం ఎంతవరకూ వెళుతుంది? అనేది మిగతా కథ.
Latest News