|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 03:43 PM
కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మరియు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం కాంతారా: చాప్టర్ 1 అక్టోబర్ 2, 2025న బహుళ భాషలలో భారీ విడుదల కోసం సిద్ధమవుతోంది. రిషబ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. మొదటి విడత కన్నడ, తెలుగు మరియు హిందీలలో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటలలో 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని మరియు 3.4 మిలియన్ లైక్స్ ని నమోదు చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. శాండల్వుడ్ బ్యూటీ రుక్మిని వాసంత్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. హోంబేల్ ఫిల్మ్స్ ఈసినిమాని నిర్మిస్తుండగా, అజనీష్ లోక్నాథ్ సంగీత స్వరకర్తగా ఉన్నారు.
Latest News