|
|
by Suryaa Desk | Mon, Sep 22, 2025, 06:56 PM
జీవితంలో ఇప్పటివరకు మాంసాహారం తినని తనతో స్విగ్గీ చికెన్ తినేలా చేసిందని తమిళ నటి సాక్షి అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో బాధ కలిగించిందని ఆదివారం ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్విగ్గీలో ఓ రెస్టారెంట్ నుంచి సాక్షి పనీర్ ఆర్డర్ చేయగా చికెన్ వచ్చింది. రెస్టారెంట్ నిర్లక్ష్యంపై ఆమె మండిపడుతూ ఆ వీడియోను షేర్ చేశారు. మతపరమైన భావాలను దెబ్బతీశారని ఆమె వాపోయారు. తమకూ ఇలాంటి ఘటనలు జరిగాయని నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు.
Latest News