|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 08:37 PM
దాదా సాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన మోహన్ లాల్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దశాబ్దాల కృషితో మలయాళ సినిమా, నాటక రంగంలో మోహన్ లాల్ ఉన్నత శిఖరాలు అధిరోహించారని కొనియాడారు. కేరళ సంస్కృతి పట్ల ఆయనకు ఉన్న మక్కువ అభినందనీయమని పేర్కొన్నారు. తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ చిత్రాలలో కూడా మోహన్ లాల్ అద్భుతమైన చిత్రాలు చేశారని అన్నారు. ఆయన సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నారు.
Latest News