|
|
by Suryaa Desk | Sat, Sep 20, 2025, 05:51 PM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. ఈ క్రేజ్ కేవలం సాధారణ ప్రేక్షకులకే పరిమితం కాలేదు, టాలీవుడ్‌లోని ఇతర హీరోలను కూడా తాకింది. తాజాగా యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ 'ఓజీ' పై చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా కోసం తానెంతగా ఎదురుచూస్తున్నాడో ఆయన మాటల్లోనే స్పష్టమవుతోంది.విజయదశమి కానుకగా ఈ నెల 25న 'ఓజీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అప్పటివరకు ఆగడం కష్టంగా ఉందని సిద్ధు తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. "ఓజీ హైప్‌కి హెల్త్ అప్‌సెట్ అయ్యేలా ఉంది. 25వ తేదీ వరకూ మేము ఉంటామో పోతామో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే 25 తర్వాత పరిస్థితి ఏంటో. పవన్ కల్యాణ్ గారు, యే పవన్ నహీ.. ఆంధీ హై" అంటూ ఆయన ట్వీట్ చేశారు. పవన్ పోస్టర్‌ను షేర్ చేస్తూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్‌తో ఇండస్ట్రీ వర్గాలు సైతం సినిమా కోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయో అర్థమవుతోంది.
Latest News