|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:46 PM
కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి యొక్క ది బెంగాల్ ఫైల్స్: రైట్ టు లైఫ్ చిత్రం సెప్టెంబర్ 5, 2025న విడుదల అయ్యింది. ఈ సినిమా మిశ్రమ సమీక్షలని అందుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా గ్లోబల్ బాక్స్ఆఫీస్ వద్ద 20 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ మరియు పల్లవి జోషి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. బెంగాల్ ఫైల్స్: రైట్ టు లైఫ్ వివేక్ అగ్నిహోత్రి చేత వ్రాయబడింది మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ మరియు పల్లవి జోషి నిర్మించారు, మరియు తేజ్ నారాయణ్ అగర్వాల్ మరియు ఐ ఆమ్ బుద్ధ ప్రొడక్షన్స్ సమర్పించారు.
Latest News