|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:40 PM
మంచు కుటుంబంలో నెలకొన్న విభేదాలపై మంచు లక్ష్మి తాజాగా స్పందించారు. ఈ నెల 19 న తన చిత్రం ‘దక్ష’ విడుదల కానున్న సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబంలోనూ సమస్యలు సహజమని అన్నారు. కుటుంబంలో ఓ సమస్య ఎదురైనప్పుడు ఆ ఫ్యామిలీలో అందరూ బాధపడతారని చెప్పారు. అయితే, తాము అద్దాల మేడలో ఉంటున్నామని, ఏది మాట్లాడినా దానిని వక్రీకరించి తమకు నచ్చిన విధంగా రాసుకునే రోజుల్లో ఉన్నామని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే ఉత్తమమని తాను భావించినట్లు ఆమె తెలిపారు. అందుకే తమ కుటుంబ వ్యవహారాలపై మౌనం పాటించినట్లు మంచు లక్ష్మి స్పష్టం చేశారు.
Latest News