|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:49 PM
స్టార్ హీరోయిన్ సమంత తన జీవితానుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినీ రంగంలో కథానాయికగా కెరీర్, గ్లామర్, అభిమానుల ఆదరణ వంటివేవీ శాశ్వతం కావనే జీవిత సత్యాన్ని తాను గ్రహించినట్లు వెల్లడించారు. తాను ఎదుర్కొన్న సమస్యలే తనకు ఎన్నో విషయాలను నేర్పించాయని ఆమె పేర్కొన్నారు.తాను కేవలం ఒక నటిగా మిగిలిపోవాలని కోరుకోలేదని, అంతకుమించి సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపాలని ఆకాంక్షించినట్లు సమంత తెలిపారు. ఒక నటిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అదృష్టంతో పాటు మరెన్నో అంశాలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. సమంత చేసిన ఈ తాత్విక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Latest News