|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 10:51 AM
శాతవాహన యూనివర్సిటీ తన రెండో స్నాతకోత్సవాన్ని నవంబర్ 7న నిర్వహించడానికి సన్నద్ధమైంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వీసీ ఉమేష్ కుమార్ మంగళవారం తెలిపారు. 2019 ఆగస్టులో జరిగిన మొదటి స్నాతకోత్సవం కంటే ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ ఈ కార్యక్రమానికి అనుమతి మంజూరు చేశారు.