|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 10:49 AM
TG: కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ రావు(60)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఇనుప సుత్తితో తలపై విచక్షణారహితంగా కొట్టడంతో రామ్మోహన్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన అనంతరం సుత్తిని పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేసి దుండగులు పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.