|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 12:14 PM
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో వారసత్వ భూమిని ఆన్‌లైన్ చేయడం లేదంటూ శంకర్ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులంతా కలిసి పెట్రోల్ పోసుకోగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో శంకర్ ఆటో పూర్తిగా కాలిపోయింది. ఈ విషయంపై వెంటనే స్పందించిన ఆర్డీఓ.. ఎంఆర్ఓ, ఆర్ఐలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతోపాటు, బాధితుడికి కొత్త ఆటో కొనిస్తామని, వారసత్వ భూమిని వెంటనే ఆన్‌లైన్ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.